సౌతిండియాలో బీజేపీకి అనూహ్య ఫలితాలు.. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సంచలన సర్వే

by Shiva |
సౌతిండియాలో బీజేపీకి అనూహ్య ఫలితాలు.. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సంచలన సర్వే
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాజకీయా పార్టీలు తమ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి 400 సీట్లు పక్కా అంటూ ఎన్నికల కదర రంగంలోకి అడుగుపెట్టింది. అయితే, ఉత్తర భారతదేశంలో బీజేపీ బలంగా ఉన్నా.. దక్షిణ భారతదేశంలో ఆ పార్టీ ఉనికి ఈ మధ్య కాలంగా ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ట్రిపుల్ తలాక్, రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి చరిత్రాత్మక నిర్ణయాలతో ప్రస్తుతం సౌతిండియాలోనూ బీజేపీ కాస్త గ్రాఫ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ 2019 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోనుందని వెల్లడైంది. అయితే, ఏపీలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వేలో తేలింది. ఇక తమిళనాడులో 5, కేరళలో 3 సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గతంలో 25 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు 22కు పరిమితమయ్యే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. కేరళలో మొత్తం సీట్లు మొత్తం 20 సీట్లు ఉండగా అందులో యూడీఎఫ్ 11, ఎల్డీఎఫ్: 06, బీజేపీ: 03 సీట్లు రానున్నాయి. తమిళనాడులో మొత్తం సీట్లు 40 ఉండగా అధికార డీఎంకేకు 20, కాంగ్రెస్ 06, బీజేపీ 05, అన్నాడీఎంకే 04, ఇతరులు 05 సీట్ల అవకాశం ఉంది. చివరగా కర్ణాటకలో మొత్తం సీట్లు 28 ఉండగా.. బీజేపీ 22, కాంగ్రెస్ 04, జేడీఎస్ 02 సీట్లను కైవసం చేసుకోబోతున్నాయని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ సర్వేల వెల్లడైంది.

Advertisement

Next Story

Most Viewed