- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మార్చ్: బండి సంజయ్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ దోషుల అంతు చూసే వరకు బీజేపీ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అందులో భాగంగా మిలియన్ మార్చ్ తరహాలో త్వరలోనే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని, ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఉగాది వేడుకల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెపర్ లీకేజీ కారకుడైన కేసీఆర్ కొడుకు రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగే వరకు పోరాడతామన్నారు. నిరుద్యోగులు ఎవరూ నిరాశ పడొద్దని బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యూపీఎస్పీ తరహాలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు.
పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆధారాలు ఇవ్వాలని సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా తనకు సిట్ నోటీసులు ఇంకా అందలేదని, అసలు సిట్ విచారణకే తాము వ్యతిరేకమని మండిపడ్డారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. ఎందుకంటే కేసీఆర్ సిట్ అంటే సిట్. స్టాండ్ స్టాండ్ గా ఆ విభాగం తయారైందని ఫైరయ్యారు. నయీం డైరీ, మియాపూర్ భూములు, డ్రగ్స్, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య సహా పలు కేసులపై విచారణ చేసిన సిట్ నివేదికలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అసలు నోటీసులు ఇవ్వాల్సి వస్తే తొలుత కేసీఆర్ కొడుకుకే నోటీసులు ఇవ్వాలని, ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారేమైనా తీస్మార్ ఖాన్ లా అంటూ ధ్వజమెత్తారు. నోటీసుల పేరుతో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
నిర్మల్‌లో విపరీతమైన భూ కబ్జాలకు పాల్పడుతూ, సఫాయి కార్మికుల నుంచి పైసలు తీసుకునే ఓ మంత్రి పేపర్ లీకేజీ సర్వసాధారణమంటున్నాడని విరుచుకుపడ్డారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను పణంగా పెట్టేలా లీకేజీ చేస్తే సర్వసాధారణమా అని బండి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో రెస్ట్ లో ఉందని, అమావాస్య, పున్నమి సమయంలో లేచి మా పార్టీ మనుగడలో ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్, సతీష్ కమాల్, సుదర్శన్ గౌడ్ ను చూస్తేనే కేసీఆర్‌లో వణుకు పడుతోందన్నారు. మీడియాకో సెపరేట్ ప్యాకేజీ పెట్టుకుని తప్పుడు సమాచారాన్ని పంపించేలా కేసీఆర్ ఏర్పాట్లు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జర్నలిస్టులపై దాడితో కేసీఆర్ పతనం మొదలైందని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం అటుకులు బుక్కి పోరాడలేదని, మందు తాగి వేల కోట్లు సంపాదించిన దుర్మార్గుడని విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వం పక్షాన పనిచేయాల్సిన తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ కేసీఆర్ బిడ్డను కాపాడటానికి ఢిల్లీకి వెళ్లి ఈడీని ఎట్లా కలుస్తారని బండి ప్రశ్నించారు. ఆయన కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తున్నారా? తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా? అని నిలదీశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, బార్ కౌన్సిల్ లో ఫిర్యాదు వేస్తామని ఆయన హెచ్చరించారు. పేపర్ లీకేజీ కారకుడు ట్విట్టర్ టిల్లునే అని, ఆయన ఎందుకు రాజీనామా చేయడని ప్రశ్నించారు. కేసీఆర్ బిడ్డ అన్ని ఫోన్లు వాడుతోందా అని బండి అవాక్కయ్యారు.
విచారణ సందర్భంగా ఆమె మీడియాకు ఫోన్లు చూపించిందని, అవి ఫోన్లా? మెడల్సా? అని ఆయన ఎద్దేవాచేశారు. ఫోన్ల ధ్వంసంపై ఈడీయే సమాధానమివ్వాలని, దాంతో తమకు సంబంధం లేదన్నారు. ఇక్కడ లీకేజీ అంశంపై మంత్రులు మాట్లాడటం లేదని, కానీ.. ఇద్దరేసి మంత్రులు షిఫ్ట్ ల లెక్కన కవిత కోసం ఢిల్లీ వెళ్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.