- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘టెట్’ రెండు పేపర్లు రాస్తే రూ. 2 వేలు అన్యాయం! ప్రభుత్వంపై నిరుద్యోగుల గుస్స!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)- 2024 ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 27 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఈసారి భారీగా దరఖాస్తుల ఫీజులు పెంచడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గతంలో కంటే ఈ సారి టెట్ పరీక్ష ఫీజు భారీగా పెంచారు. ఒక పేపర్ దరఖాస్తు చేసుకంటే రూ. వెయ్యి, రెండు పేపర్లు రాస్తే రూ. 2 వేలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. గతంలో తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత 2016లో తొలిసారి టెట్ పరీక్ష నిర్వహించగా.. అప్పుడు ఫీజు కేవలం 200 రూపాయలు తర్వాత 2017లో కూడా అలానే కంటిన్యూ చేశారు. గత ఏడాది రెండు పేపర్లకు కలిపి రూ. 400గా నిర్ణయించారు.
తాజా నోటిఫికేషన్‌లో రెండు పేపర్లకు కలిపి దరఖాస్తు రుసుము రూ. 2 వేలుగా నిర్ణయించారు. కాగా, ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ.. మే 20 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు ముగుస్తాయని విద్యా శాఖ వెల్లడించింది. కాగా, ఫీజు భారీగా పెంచారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల ఓట్ల ద్వారా గెలిచామని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఫీజులు పెంచడం అన్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పోటీ పరీక్షలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు వసూలు చేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చి నేడు గతంలో కంటే భారీగా వసూలు చేయడం ఏమిటని నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు.