మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌పై అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్

by Gantepaka Srikanth |
మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్‌పై అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి మహేశ్‌‌లను అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు(Cyber ​​crime police) తెలిపారు. రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

కాగా, తనపై, మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై దుబ్బాక పోలీస్ స్టేషన్‌‌తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై కూడా రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆ వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్‌తో పాటు దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లైంట్ చేశారు. మహిళలను అవమానించడం సరైన పద్ధతి మండిపడ్డారు. మంత్రిపై తప్పుడు పోస్టులు పెట్టిన వారు ఎంత పెద్దవారైనా శిక్షపడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఒక అక్క, తమ్ముడి వయసులో ఉన్న వారిని ట్రోల్ చేయడం సరైంది కాదని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed