- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rave Party : రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. ఆ ఇద్దరు సినీనటులు ఎవరు?
దిశ, డైనమిక్ బ్యూరో : సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తవ్వినకొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు పేర్కొన్నారు. ఇవాళ కేసు వివరాలను సీపీ దయానంద మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్ డే పార్టీని జీఆర్ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేయగా 150 మంది హాజరయ్యారని తెలిపారు. ‘సన్‌సెట్ టు సన్‌రైజ్ విక్టరీ’ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీలో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో భారీ డీజే సౌండ్ రావడంతో పొరుగు వారు ఫిర్యాదు చేశారని దీంతో రేవ్ పార్టీ విషయం బయటపడిందని వెల్లడించారు. తనిఖీల్లో ఎండీఎంఏ పిల్స్, కొకైన్, హైడ్రో గాంజా సహా మరికొన్ని మత్తు పదార్థాలు గుర్తించినట్లు తెలిపారు. అయితే పోలీసుల రాకతో డ్రగ్స్‌ను స్విమ్మింగ్ పూల్స్‌లో విసిరేశారని ఈ మాదక ద్రవ్యాలను గుర్తించేందుకు దేశంలో తొలిసారి డాగ్ స్క్వాడ్ ఉపయోగించామని వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశామని ఇందులో ఇద్దరు సూత్రదారులు, ముగ్గురు పెడ్లర్లు ఉన్నారని పేర్కొన్నారు.
అందరి రక్తనమూనాలు సేకరించాం...
పార్టీకి తెలుగు, కన్నడ సినీ ప్రముఖులు హాజరైనట్లు పోలీసులు తెలిపారు. ప్రజాప్రతినిధులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. పార్టీకి హాజరైన వారందరి రక్త నమూనాలు సేకరించామని వారిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారనేది శాంపిల్స్ ఫలితాలు వచ్చాక తెలుస్తుందని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని దయానంద తెలిపారు. పార్టీకి వచ్చిన వారి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని ఇలాంటి రేవ్ పార్టీలు ఇంకా ఎక్కడెక్కడ ఎప్పుడు జరిగాయి? వాసు కాంటాక్ట్ లిస్టులో ఎవరెవరు ఉన్నారు? డ్రగ్స్ ఎలా చేరాయి? అనే కోణంలో కేసు విచారణ సాగుతోందని తెలిపారు.
ఆ ఇద్దరు సెలబ్రెటీలు ఎవరు?..
పార్టీకి ఇద్దరు తెలుగు సెలబ్రెటీలు హాజరయ్యారనే ప్రచారం జరుగుతోంది. అయితే తాను ఈ పార్టీకి హాజరు కాలేదని నటి హేమ స్పష్టం చేయగా బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె పార్టీకి హాజరయ్యారని నిన్ననే మరో ఫొటోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నటి హేమ బుకాయిస్తోందా అనే చర్చ సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. మరోవైపు పార్టీకి హాజరైన వారిలో హీరో శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ ఉన్నారనే ప్రచారం జరుగగా తాము హాజరుకాలేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది సస్పెన్స్‌గా మారింది.