TTD Chairman: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. టీటీడీ చైర్మన్‌గా ఆయన పేరు ఫిక్స్!

by Shiva |
TTD Chairman: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. టీటీడీ చైర్మన్‌గా ఆయన పేరు ఫిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో టీటీడీకి కాబోయే కొత్త చైర్మన్ ఎవరనే దానిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ పదవి కోసం టీడీపీ, బీజేపీ నేతలు గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే, ఆ మధ్య జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు, ప్రముఖ నిర్మాత అశ్విని‌దత్ పేరు బలంగా వినిపించాయి. కానీ, విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ చైర్మన్‌గా టీవీ-5 ఛానల్ యజమాని బీఆర్ నాయుడు పేరును త్వరలోనే ప్రకటించబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కీలకమైనది కావడంతో చైర్మన్ నియామకంపై కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.

Advertisement

Next Story