- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. గవర్నర్‌తో నేడు టీ-బీజేపీ నేతల భేటీ!
X
దిశ, తెలంగాణ బ్యూరో: లీకేజీ వ్యవహారంపై బీజేపీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. శనివారం ఉదయం 9:30 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ టాస్క్ ఫోర్స్ బృందం తమిళిసైని కలవనున్నది. పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఒక నివేదిక రూపంలో గవర్నర్ కు అందించనున్నది. అంతేకాకుండా లీకేజీ అంశం ఐటీ శాఖదేనని, దీనికి మంత్రి కేటీఆర్ కూడా బాధ్యుడని, ఆయన్ను బర్తరఫ్ చేయాలని లేఖలో పొందుపరిచినట్లు సమాచారం. విచారణ బాధ్యతలు సిట్ కు కాకుండా ఇతర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని గవర్నర్ ను విజ్ఞప్తి చేయనున్నారు. గవర్నర్ తో భేటీ అనంతరం బండి సంజయ్ శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. బీజేపీ లీగల్ సెల్ కు చెందిన మహిళా న్యాయవాదులతో ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లనున్నారు.
Advertisement
Next Story