- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC పేపర్ లీక్ పొరపాటే.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: నీళ్లు, నిధులు, నియామకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గుండెల మీద చెయ్యి వేసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బుధవారం బషీర్ బాగ్ లో స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి... గడిచిన పదేళ్లలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పంథాలో నడిపించామని, పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ దే నన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కరవు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను తీర్చిదిద్దామని, కేసీఆర్ విజన్ తో విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. విద్య,వైద్యం, విద్యుత్, హైదరాబాద్ డెవలప్ మెంట్, ఐటీ రంగాలతో పాటు అనేక అంశాలపై విజన్ తో ముందుకు వెళ్ళామని చెప్పారు. ఈ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే సంక్షేమ పథకాలు రూపొందించిందన్నారు.
ప్రతిపక్షాలకు పోలింగ్ బూత్ లోనే గుణపాఠం
రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు విజన్ లేదని దుయ్యబట్టారు. విమర్శించడానికి ఏమి లేక ప్రతిపక్షాలు తమపై బూతులు మాట్లాడుతున్నాయి. చెప్పుతో కొట్టాలి అని నిన్న ఒక నేత అన్నాడు. బూటుతో కొట్టాలి అని మేమూ మాట్లాడలేమా? బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలని ఓటర్లను కోరారు. తెలంగాణ బిడ్డ కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటయ్యాయని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దరిదాపుల్లో ఏ రాష్ట్రం లేదని దుయ్యబట్టారు. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ తెలంగాణపై కక్షసాధిస్తోందని విమర్శించారు. మైనార్టీ ఓట్ల కోసం బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ కుట్రపూరిత మాటలు మాట్లాడుతున్నదని వీటిని ప్రజలు నమ్మవద్దని కోరారు.
పేపర్ లీక్ పొరపాటే
టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్స్ పై మంత్రి హరీష్ రావు స్పందిస్తూ ఇది పొరపాటే అన్నారు. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం మేము చేయడం లేదని చెప్పారు. పేపర్ లీక్ దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అని దీనిని కూడా ప్రభుత్వమే గుర్తించి సీఐడీ ఎంక్వయిరీ చేయించి నిందితులను అరెస్ట్ చేయించామన్నారు. భవిష్యత్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏ ఏడాది ఏర్పడే ఖాళీలను అదే ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగాల నియామకాల విషయంలో తమ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలనే నినాదంతో ముందుకు సాగామని ఇందులో భాగంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో కేసీఆర్ సవరణ తీసుకువచ్చి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామన్నారు. గత హయాంలో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈసారి 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాది కాలం, కరోనా వల్ల రెండేళ్లు గడిచిపోయిందన్నారు. ప్రభుత్వం అవలంభించిన విధానాల వల్ల ప్రైవేటు రంగంలో 24 లక్షల ఇండస్ట్రీలు, 6 లక్షలు ఐటీ రంగాల్లో వచ్చాయన్నారు.