TSPSC పేపర్ లీకేజీ కేసు: ప్రవీణ్ ఫోన్‌లో ఏడుగురు మహిళల నగ్న ఫొటోలు

by GSrikanth |   ( Updated:2023-03-15 04:11:58.0  )
TSPSC పేపర్ లీకేజీ కేసు: ప్రవీణ్ ఫోన్‌లో ఏడుగురు మహిళల నగ్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తులో పోలీసుల చేతికి కీలక సమాచారం అందింది. పరీక్షల్లో ఉత్తీర్ణతకు సహకరిస్తానంటూ పలువురి యువతులకు ప్రవీణ్ వల వేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రవీణ్ ఫోన్‌లో ఏడుగురు మహిళల నగ్న ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి మహిళలకు సహకరించారని ప్రవీణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చగా.. ప్రవీణ్‌తో పాటు మరో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులను పదిరోజుల కస్టడీని పోలీసులు కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ కోర్టులో వాదనలు జరుగనున్నాయి.

Advertisement

Next Story