TSPSC లీకేజీ కేసు : రేణుకకు బెయిల్ మంజూరు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-11 05:10:22.0  )
TSPSC లీకేజీ కేసు : రేణుకకు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహరంలో యువతి రేణుకకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. రూ.50వేల పూచీకత్తుతో రేణుకకు బెయిల్ లభించింది. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో సిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు రేణుకకు ఆదేశించింది. ఇదే కేసులో నిందితులు రమేష్, రాజేందర్ లకు బెయిల్ మంజూరైంది. బెయిల్ పై విడుదలైన ముగ్గురి పాస్ పోర్టు లను సీజ్ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

Advertisement

Next Story