నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-12 23:31:01.0  )
నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్టేట్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీఎస్​ పీఎస్సీ)లో నమోదైన నిరుద్యోగులందరూ వివరాలను ఎడిట్​ చేసుకోవాలని స్పష్టం చేశారు. 15 రోజుల కిందట్నుంచే టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​ ఆన్​లాక్​ చేసిన కమిషన్​.. వన్​ టైం రిజిస్ట్రేషన్​లో వివరాలను ఎడిట్​కు అవకాశం కల్పించింది. కొత్త జిల్లాలు, జోన్లు ఏర్పాటు కావడంతో స్థానికతను తేల్చే విధంగా ఎడిట్​ చేయాలని పేర్కొన్నారు. టీఎస్​పీఎస్సీ ఓటీఆర్​లో మొత్తం 25.18 లక్షల మంది నిరుద్యోగులు నమోదై ఉంటే.. ఇప్పటి వరకు 1.12 లక్షల మంది మాత్రమే ఎడిట్​ చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో టీఎస్​పీఎస్సీ కీలక నిర్ణయం వెల్లడించింది. అభ్యర్థులందరికీ ఈ మెయిల్​, ఫోన్లకు సమాచారం పంపించారు. ఓటీఆర్​లో వివరాలు నమోదు చేసుకున్న వారంతా కచ్చితంగా ఎడిట్​ చేసుకోవాలని సూచించింది. దాని ప్రకారమే స్థానికతను తేల్చుతామని, ఓటీఆర్​లో నమోదు కాకున్నా, గతంలో నమోదు చేసుకుని ఎడిట్​ చేసుకోని వారందరినీ టీఎస్​పీఎస్సీ వెలువరించే నోటిఫికేషన్లకు అనర్హులుగా గుర్తిస్తామని వెల్లడించింది. అంతేకాకుండా ఓటీఆర్​లో నమోదు చేసుకున్న వారు ఫోన్​ నెంబర్లు మార్చితే వాటిని ఎడిట్​ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పాత మొబైల్​ స్థానంలో కొత్త మొబైల్​ నెంబర్​ను ఎడిట్​ చేయాలని వెబ్​సైట్​లో కాలమ్​ రూపొందించింది.

Advertisement

Next Story