- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తులో కొత్తకోణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో అధికారులు సంచలన విషయాలు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 19 మందిని సాక్షులుగా చేర్చారు. టీఎస్ పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర లక్ష్మితో పాటు అదే కార్యాలయంలో పనిచేసే మరో ఇద్దరిని సాక్షులుగా పేర్కొన్నారు. వీరితో పాటు కర్మన్ ఘాట్ ఓ లాడ్జ్ యజమాని, ఇద్దరు సిబ్బందిని సైతం సాక్ష్యులుగా పేర్కొన్నారు.
ఈ లాడ్జీలోనే ప్రశ్నాపత్రాలను ప్రవీణ్ ఇతరులకు లీక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ లాడ్జిలో ఉన్న సీసీ దృశ్యాలను సిట్ అధికారులు సేకరించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను అరెస్ట్ చేసినట్లు సిట్ తెలిపింది. ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.