Police Candidates కు బిగ్ అలర్ట్.. తుది పరీక్షల తేదీలు ఫిక్స్

by samatah |   ( Updated:2023-01-01 07:06:14.0  )
Police Candidates కు  బిగ్ అలర్ట్.. తుది పరీక్షల తేదీలు ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : పోలీసు అభ్యర్థులకు కీలక ప్రకటన. ఎస్సై, కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన తుది పరీక్షల తేదీలను TSLPRB ప్రకటించింది. మార్చి 12,2023 నుంచి తుది పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ 9న సివిల్ ఎస్సై మెయిన్స్, ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఉదయం 10 నుంచి 1 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ 2 ఉంటుందని తెలిపింది. కాగా, మెయిన్స్ పరీక్షలకు సంభందించి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ తేదీలను త్వరలో ప్రకటిస్తామని, ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు TSLPRB వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి : మందుబాబులకు షాక్.. 5,819 డ్రైవింగ్ లైసెన్స్‌లు క్యాన్సిల్

Advertisement

Next Story

Most Viewed