- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS Weather: రాష్ట్రాన్ని ఠారెత్తిస్తున్న భానుడు.. ఉక్కపోతతో జనజీవనం అతలాకుతలం
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని భానుడు తన ప్రతాపంతో ఠారెత్తిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో జన జీవనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఉదయం 7 తర్వాత జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక హైదరాబాద్ మహానగరంలో మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులు అన్ని నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలకు కీలక సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు, ఎల్లుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇవాళ నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రేపు, ఎల్లుండి రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగుతాయని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక సోమవారం. ఇవాళ అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండలాల్లో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
- Tags
- TS Weather