పండక్కి ఊరెళ్తూ.. టోల్‌ప్లాజా వద్ద టైమ్ వేస్ట్ చేసుకోకండి!

by GSrikanth |   ( Updated:2023-01-21 14:32:31.0  )
పండక్కి ఊరెళ్తూ.. టోల్‌ప్లాజా వద్ద టైమ్ వేస్ట్ చేసుకోకండి!
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డ ప్రజలు సొంతూళ్లకు పయణమయ్యారు. దీంతో నగరంలోని అన్ని ప్రయాణ ప్రాంగణాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉన్నటువంటి పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో సొంత వాహనాల్లో ఊర్లకు ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. 'సొంత వాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్‌ప్లాజాల వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దు. గంటల తరబడి టోల్‌ప్లాజా వద్ద నిరీక్షించవద్దు. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లైన్ల వద్ద వేగంగా పనిపూర్తి చేసుకొని వెళ్లండి.'' అని సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా సూచించారు.

Read More...

ఈ నెల 15నే సికింద్రాబాద్‌–విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభం

Advertisement

Next Story