మల్లన్న భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్ న్యూస్.. కొమురవెల్లికి ప్రత్యేక బస్సులు

by Shiva |   ( Updated:2024-01-21 11:26:44.0  )
మల్లన్న భక్తులకు టీఎస్‌ ఆర్టీసీ గుడ్ న్యూస్.. కొమురవెల్లికి ప్రత్యేక బస్సులు
X

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి కల్యాణోత్సవం, పట్నం వారం, లష్కర్ వారం, మహా శివరాత్రి పర్వదినం రోజు పెద్ద పట్నం, అగ్ని గుండాల కార్యక్రమాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే మల్లన్న భక్తులు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జాతరకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జేబీఎస్ మీదుగా కొమురవెల్లికి బస్సులు నడుపనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 8.30కి, మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 5.40కి జాతరకు బస్సులు బయలుదేరుతాయని ఇవాళ వెల్లడించారు. మళ్లీ కొమురవెల్లి నుంచి ఉదయం10.50కి, మధ్యాహ్నం 3.30కి, సాయంత్రం 7.50కి సిటీకి బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వి.వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Next Story