ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముఖ్యంగా మహిళలకు పండగే

by Shiva |
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ముఖ్యంగా మహిళలకు పండగే
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి పండుగకు పుట్టింటికి వెళ్లే మహిళలకు ఉచిత బసు ప్రయాణం పథకం అందుబాటులో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. అయితే అది కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు నడుపుతామని స్పష్టం చేశారు. ఆంధ్రకు వెళ్లే తెలంగాణ బస్సుల్లో కేవలం తెలంగాణ సరిహద్దు వరకు ఉచితంగా టికెట్ ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, గత కొన్ని రోజులుగా సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని టీఎస్ ఆర్టీసి రద్దు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రూమర్స్‌పై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

శబరిమల వెళ్లే భక్తులకు ప్రత్యేక సర్వీసులు..

అయ్యప్ప భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులను రాష్ట్రంలో జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి శబరిమలకు వెళ్లే ప్రతి ప్రయాణికుడి వద్ద నుంచి రూ.13,600 చొప్పున వసూలు చేయనున్నారు. ఇందులో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story