TS Govt.: రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం.. వారికి త్వరలో ఎలక్ట్రికల్ స్కూటర్లు!

by Shiva |   ( Updated:2024-08-05 02:52:11.0  )
TS Govt.: రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం.. వారికి త్వరలో ఎలక్ట్రికల్ స్కూటర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే త్వరలో 18 ఏళ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఉచితంగా అందజేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే, అందుకు సంబంధించిన విధివిధాలకు రూపకల్పన చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లుగా సమాచారం. అయితే, ఈ పథకంలో భాగంగా కేవలం విద్యార్హత ఉన్నవారికే స్కూటర్లు ఇస్తారా లేక అందరికీ పథకంలో భాగస్వామ్యం కల్పిస్తారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒక వేళ ఒకే ఇంట్లో ఇద్దరు లేద ముగ్గురు ఆడ పిల్లలు ఉంటే.. అందరికి ఇస్తారా అన్న ఆలోచన అందరిలోను మెదలుతోంది. కాగా, ఈ పథకంపై సర్కార్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

Next Story