TS EAPCET-2024: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బిగ్ అలర్ట్‌.. బ్రాంచ్ చేంజ్‌కు మరో అవకాశం

by Shiva |   ( Updated:2024-08-20 17:25:56.0  )
TS EAPCET-2024: ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బిగ్ అలర్ట్‌.. బ్రాంచ్ చేంజ్‌కు మరో అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్నత విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తాము ఎంచుకున్న అదే కాలేజీలో బ్రాంచ్‌ను మార్చుకునేందుకు (సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్) అవకాశం కల్పిస్తూ ఉత్వర్వులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఆగస్టు 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ రౌండ్‌ను ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు tgeapcet.nic.inలో అందుబాటులో ఉండే లింక్ ద్వారా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీని ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్ చివరి రౌండ్‌లో షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఆగస్టు 17, 2024లోపు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని తెలిపారు. అదేవిధంగా TS EAMCET-2024 వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఆగస్ట్ 22, 2024న ముగియనుంది. ఇక స్లైడింగ్ రౌండ్ సీటు కేటాయింపు ఆగస్టు 24, 2024న వెల్లడించనున్నారు.

Advertisement

Next Story