- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ.. కవితకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో : ఎమ్మెల్సీ కవిత మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం చార్జీషీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించడంపై రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలకు కవిత 'రాజగోపాల్ అన్న .. తొందరపడకు , మాట జారకు !! " 28 సార్లు " నా పేరు చెప్పించినా" 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు..'అంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, కవిత రిప్లైపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. 'నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాంలో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం.
నిన్ను మీ అన్న.. మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ట్విట్టర్ టిల్లు (కేటీఆర్) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన రూ.18వేల కోట్ల కోల్ బ్లాక్ టెండర్ విషయంలో నాపై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసినందుకు రాబోయే రోజుల్లో అవినీతి మయమైన మీ కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం'అంటూ రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనికి ఎమ్మెల్సీ కవిత ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక @KTRTRS(#TwitterTillu) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల 1/2 https://t.co/xKfidkDslc
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022