- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Big Breaking: కాంగ్రెస్‌లో చేరనున్న డీఎస్.. ముహూర్తం ఫిక్స్
దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో జనవరి 24న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. గత కొన్నేళ్లుగా అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డీఎస్ త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేయగా, ఈ వార్తలకు క్లారిటీ ఇస్తూ.. కాంగ్రెస్ అధిష్టానం చేరిక తేదీ ప్రకటించింది. కాగా, ప్రస్తుతం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న డీఎస్ పదవీకాలం మరో ఐదు నెలల్లో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులతో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే, కాంగ్రెస్‌లో చేరడానికి ముందే డీ.శ్రీనివాస్ టీఆర్ఎస్ ద్వారా లభించిన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అంతేగాక, కష్ట కాలంలో పార్టీని వీడిన డీఎస్‌ను తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకొనే విషయమై కొందరు నేతలు సుముఖంగా లేరనే ప్రచారం సాగుతుంది.