- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసు వాహనానికి టీఆర్ఎస్ పార్టీ జెండా.. ఏసీపీ రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిజం చేశారు ఖమ్మం జిల్లా పోలీసులు. ఏకంగా పోలీస్ వెహికిల్‌కు టీఆర్ఎస్ పార్టీ జెండాను పెట్టుకుని తిరిగారు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా పాలేరులో మూడు రోజుల క్రితం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో బందోబస్త్ ఏర్పాటు చేసిన కూసుమంచి పోలీసులు ఎమ్మెల్యే కార్యక్రమాలను ఫాలో అయ్యారు. అయితే పోలీస్ వాహనానికి వెనక వైపు టీఆర్ఎస్ పార్టీ జెండాను తగిలించారు. అయినా పోలీసులు అలాగే పర్యటించడంతో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్రంలో హల్ చల్ చేస్తోంది.
కాగా, ఈ వీడియోపై ఖమ్మం రూరల్ ఏసీపీ భస్వారెడ్డి స్పందించారు. వ్యక్తిగత స్వలాభాల కోసం పోలీసులకు నిరాధార ఆరోపణలు ఆపాదించడం సరికాదని ఆక్షేపించారు. ఎమ్మెల్యే బందోబస్తుకు వచ్చిన పోలీసు వాహనానికి వెనుకవైపు నుండి ద్విచక్ర వాహనంపై పార్టీ కార్యకర్తలు జెండాతో వస్తున్న సందర్భంగా తీసిన ఫోటోలను వక్రీకరిస్తూ.. ఉద్దేశపూర్వకంగా పోలీసులపై దుష్పచారం చేయడం సరికాదని అన్నారు. సమాజంలో శాంతిభద్రతల కోసం శ్రమిస్తున్న పోలీసులపై సామాజిక మాద్యమాల్లో అనాలోచిత ఆరోపణలు చేయడం, వారి మనోభావాలు కించపరిచే విధంగా పోస్టింగ్‌లు పెట్టడం సరికాదని, దీన్ని పూర్తిగా ఖండిస్తునమన్నామని ఏసీపీ చెప్పారు. ఇలాంటి చట్టవ్యతిరేంగా దుష్ప్రచారం చేసేవాళ్ళు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.