- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఆర్ఎస్ మైండ్ డైవర్షన్ ప్లాన్ సక్సెస్.. ఏమరపాటులో బీజేపీ!
దిశ,తెలంగాణ బ్యూరో : ఫామ్ హౌజ్ ఎపెక్ట్ బీజేపీ లీడర్లపై పడిందని టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది. బై ఎలక్షన్ ప్రచారం మంచి ఊపు మీద ఉన్నప్పుడు ఆపరేషన్ ఫామ్ హౌజ్ ఎఫిసోడ్ బయటికి వచ్చింది. కేంద్ర బీజేపీ లీడర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ లీడర్లు రోడ్ల మీదికి వచ్చారు. మంత్రులు రాత్రి పూట జాతీయ రహదారులపై ధర్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కేడర్ ఆందోళనకు దిగింది. దీంతో బీజేపీ స్టేట్ లీడర్లు ఎన్నికల ప్రచారం పక్కన పెట్టేసి టీఆర్ఎస్ కు కౌంటర్లు ఇవ్వడంపై పోకస్ పెట్టాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం పక్కన పెట్టేసి ఫామ్ హౌజ్ అంశంపై మాత్రం లీడర్లు మాట్లాడాల్సి వచ్చింది.
ఆ రెండు రోజల్లో చక్కబెట్టిన టీఆర్ఎస్?
ఫామ్ హౌజ్ అంశంపై బీజేపీ లీడర్లు ఫోకస్ పెట్టిన టైమ్ లోనే టీఆర్ఎస్ కు కలిసి వచ్చిందనే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పై కౌంటర్లు ఇవ్వడంపై దృష్టి పెట్టిన టైమ్ లో మునుగోడులో టీఆర్ఎస్ అన్ని చక్కబెట్టిందని అంటున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కావాల్సిన సామాగ్రి అంత మునుగోడుకు చేరవేశారని,అందుకే ప్రచారం చివరి రోజు సెగ్మంట్ మొత్తం ఒకేసారి ఓటర్లకు డబ్బులు పంచారని చర్చ జరిగింది.