- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS సర్కార్‌కు 15 రోజుల డెడ్‌లైన్.. MP కోమటిరెడ్డి సంచలన ప్రకటన
దిశ, డైనమిక్ బ్యూరో: 15 రోజులు టైమ్ ఇస్తున్న రైతులకు న్యాయం చేయండి.. లేదంటే మేమే మీపై యుద్ధం చేస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బండ రావిరాల, చిన్న రావిరాల సర్వే నెం.268లో భూమి కోల్పోయిన రైతులతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూ నిర్వాసితుల కోసం త్వరలో 72 గంటల దీక్ష పెట్టబోతున్నట్లు ప్రకటించారు. శాంతియుతంగా పోరాటం చేస్తానని వెల్లడించారు. తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశానని.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతుల కోసం మరోసారి దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తమకు న్యాయం చేయాలని గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న రైతు పోరాట సమితికి వెంకట్ రెడ్డి మద్దతుగా నిలిపారు. రైతులు పోరాటాన్ని మధ్యలో ఆపొద్దని సూచించారు. తాను మీకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని మండిపడ్డారు. భువనగిరి ప్రాంతంలో ఎకరాకు రూ.32 లక్షల నష్టపరిహారం ఇస్తే ఇక్కడ మాత్రం రూ. 7.15 లక్షలే ఇచ్చారని మీకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మీరేం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులను నియోజకవర్గంలో తిప్పడానికి బదులు ప్రజలకు న్యాయం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు.