- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాల వర్షాలతో రైతన్నలకు ఇబ్బందులు
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్లలోని విలీన గ్రామాలలో అన్నదాతలు వరి ధాన్యాన్ని రోడ్లపై ఎండబెట్టారు. గురువారం అర్ధరాత్రి అకాల వర్షం వచ్చి నష్టం కలిగించిందని రైతులు వాపోయారు. వరి ధాన్యం కోసి ఆరబెట్టగా మాచర్‌కు వచ్చాయి. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం సకాలంలో ప్రారంభించకనే పరిణామం జరిగిందని రైతులు వాపోతున్నారు. కవర్లు ఇవ్వకపోవడం సొసైటీ, సహకార సంఘాల, నిర్లక్ష్య వైఖరి వల్లే ధాన్యం తడిచాయని సరైన టైంలో కవర్లు ఇస్తే నష్టం వాటిల్లకుండా ఉండేదని అన్నదాతలు ఆరోపించారు.
ఇప్పటికైనా వరి ధాన్య కేంద్రాలను త్వరగా ప్రారంభించాలని. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేదంటే వర్షాలు మళ్లీ వస్తే మాకు చాలా నష్టం జరిగే సూచనలు ఉన్నాయని తెలిపారు. అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయన్నారు. ఇటు ప్రభుత్వమైన సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే బాగుండు అని రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు లేకనే రైతులకు నష్టం జరుగుతోందన్నారు. వరి ధాన్యం పోసిన వెంటనే రైతులకు కవర్లు ఇస్తే ధాన్యం తడవకుండా ఉండేదన్నారు. కవర్లు ఇవ్వకపోవడం వల్లే నష్టం ఎక్కువ వాటిలిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరారు.