పెట్టుబడుల వృద్దితో కేటీఆర్ పై ట్రోల్స్.. ట్విట్టర్ లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన కేటీఆర్

by Ramesh Goud |   ( Updated:2024-06-22 11:02:13.0  )
పెట్టుబడుల వృద్దితో కేటీఆర్ పై ట్రోల్స్.. ట్విట్టర్ లో స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డైరెక్డ్ ఫారెన్ ఇన్వెస్టిమెంట్ లలో శాతం పరంగా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యధిక వృద్ది సాధించిందని వస్తున్న వార్తలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.పెట్టుబడుల వృద్దిపై కేటీఆర్ సూటుబూటు వేసి తిరిగిన రాలేదని, కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న ట్రోల్స్ పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2024 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు వచ్చిన డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్టిమెంట్ అక్షరాలా 3 బిలియన్ డాలర్ లు అని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి, కేటీఆర్ సూటు బూటు వేసుకుని షోపుటప్ చేసినా 2023 వ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు వచ్చిన డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్టిమెంట్ కేవలం 1.3 బిలియన్ డాలర్ లు మాత్రమేనని కేటీఆర్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ వస్తున్నాయి. అంతేగాక కాంగ్రెస్ వచ్చాక కంపెనీలు తరలిపోతున్నాయని కేటీఆర్ చేసిన తప్పుడు ప్రచారానికి “చెంప చెళ్లు” మనే వాస్తవం ఇది అని కాంగ్రెస్ శ్రేణులు నెట్టింట ప్రచారం చేస్తున్నారు.

దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. గతంలో పెట్టుబడులు వచ్చినట్లు ఉన్న పేపర్ క్లిప్పింగ్ లను ఆధారాలుగా షేర్ చేస్తూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. దీనిపై ఎఫ్‌డిఐలు క్షీణించిన ఒక సంవత్సరంలో, గుజరాత్, తమిళనాడుతో పాటు తెలంగాణ కూడా ఈ ధోరణిని బక్ చేయగలిగింది అని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరం మొత్తంగా ఎఫ్‌డీఐ ప్రవాహాలకు సంబంధించినంత వరకు భారతదేశానికి ప్రతికూలంగా ఉందని, అందుకే గుజరాత్, తమిళనాడు మరియు తెలంగాణ 2024 ఆర్ధిక సంవత్సరంలో ఎఫ్‌డీఐలో 55%, 12% మరియు 130% వృద్ధిని సాధించాయయని అన్నారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ వెబ్ సేవల పెట్టుబడి రూ.36,300 కోట్లు, మైక్రోసాఫ్ట్ రూ.16 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, అవి 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో కార్యరూపం దాల్చడంతో.. శాతంలో వృద్ధి పరంగా తెలంగాణ అత్యధికంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story