- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త రెవెన్యూ చట్టం బాగుంది.. ట్రెసా రాష్ట్ర సంఘం హర్షం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు మేలు చేసేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం పట్ల ట్రెసా రాష్ట్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కే.గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, కే.నిరంజన్ రావు, సభ్యులు దేశ్య, రమన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రెసా ప్రతినిధులు మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ముసాయిదా ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయం కోరడం చారిత్రాత్మకమని దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కోసం గ్రామ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులను తీసుకువస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఇతర శాఖలకు బాదలయించిన వీఆర్వోలను, వీఆర్ఎలను తిరిగి రెవెన్యూలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్త రెవెన్యూ చట్టంపై త్వరలో ట్రెసా ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రెవెన్యూ శాఖలో( 9) మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మరింత మంది అర్హత కల్గిన తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు, డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు.