- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Trending: గురు, శిష్యుల బంధానికి కొత్త భాష్యం.. బదిలీపై వెళ్తున్న టీచర్లకు విద్యార్థుల క్షీరాభిషేకం
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి విద్యార్థికి గురువు భగవంతుడితో సమానం. ఇంట్లో తల్లిదండ్రులు ఆలనా పాలనా చూస్తే.. బడిలో విద్యా బుద్ధులు నేర్పుతూ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది ఉపాధ్యాయులే. అలాంటి ఉపాధ్యాయులకు కొందరు విద్యార్థులు జీవితంలో మర్చిపోలేని సత్కారం చేశారు. గురు, శిష్యుల బంధానికి కొత్త భాష్యం చెప్పారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని మిట్టగూడెం పాఠశాలలో సురేష్ అనే ఉపాధ్యాయుడితో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయినులు మరో పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అయితే ఇన్నాళ్లు తమను కంటికిరెప్పలా చూసుకుని చక్కగా పాఠాలు బోధించే ఉపాధ్యాయులు బదలీపై వెళ్తున్నారని తెలిసి విద్యార్థులు కంటతడి పెట్టారు. అయితే, జీవితంలో ఆ టిచర్లు తమను మర్చిపోకుండా ఏకంగా వారికి క్షీరాభిషేకం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.