Obscene: సరూర్‌నగర్‌లో ట్రాన్స్‌జెండర్ల అశ్లీల కార్యకలాపాలు! పది మంది అరెస్ట్

by Ramesh N |
Obscene: సరూర్‌నగర్‌లో ట్రాన్స్‌జెండర్ల అశ్లీల కార్యకలాపాలు! పది మంది అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ (Saroornagar) లో ట్రాన్స్‌జెండర్లు అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీటీ కాలనీ, కట్ట కింద కళ్లు కాంపౌడ్ దగ్గర కొంత మంది (Transgender) ట్రాన్స్‌జెండర్లు నివాసం ఉంటున్నారు. వారు అర్థరాత్రి సమయంలో.. రోడ్లపైకి వచ్చిన వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, తమ ఫోన్‌లలో వీడియోలు తీసి.. స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శనివారం రాత్రి రైడ్స్ నిర్వహించారు.

ఈ క్రమంలోనే 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పీఅండ్‌టీ కాలనీలో ట్రాన్స్‌జెండర్లు విచ్చలవిడిగా సెక్స్ దందా నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుకు మేరకు వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఎప్పటి నుంచి వ్యవహారం నడిపిస్తున్నారు.. వీరు ఎక్కడి నుంచి వచ్చారో పోలీసులు విచారణ చేపట్టనున్నారు. కాగా, కాలనీలో రోడ్లపై ఆర్థరాత్రి సమయంలో తీసిన ట్రాన్స్‌జెండర్ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story