ట్రాన్స్జెండర్ అయితే ఆ పని చేయాలా?.. ‘దిశ టీవీ’తో ట్రాన్స్జెండర్ మేకల హర్షిణి స్పెషల్ ఇంటర్వ్యూ

by Hamsa |   ( Updated:2023-10-10 11:48:28.0  )
ట్రాన్స్జెండర్ అయితే ఆ పని చేయాలా?.. ‘దిశ టీవీ’తో ట్రాన్స్జెండర్ మేకల హర్షిణి స్పెషల్ ఇంటర్వ్యూ
X

దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో అవమానం.. స్కూల్ కు వెళితే అక్కడ అవమానం. సమాజంలో ఎక్కడికెళ్లినా అవమానం. ఇదంతా అతడు ‘ఆమె’గా మారాలనుకున్నందుకు.. మారినందుకు. ట్రాన్స్జెండర్ గా మారాలనుకున్న ఆమె నిర్ణయాన్ని కుటుంబ సభ్యులెవరూ ఒప్పుకోలేదు. సమాజం ఆమెను హేళన చేసింది. కానీ ఎవరికోసం తన ఇష్టాన్ని మార్చుకోనని డిసైడ్ అయి ట్రాన్స జెండర్ గా మారింది. అమ్మాయిగా మారాక పూట గడవాలంటే ఇబ్బందిగా తయారైంది. బతుకుదెరువు కోసం అయితే S-Work చేయాలి లేదంటే బెగ్గింగ్ చేయాలన్నారు. కానీ ఇవి ఆమెకు ఏమాత్రం ఇష్టంలేని పనులు.

అందుకే సమాజంలో గౌరవంగా బతకడానికి నిశ్చయించుకుంది. ఎన్నో రాత్రులు పస్తులతో గడిపింది. ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొంది. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ తనను చూసి ఛీ అన్నవాళ్లతోనే శభాష్ అనిపించుకుంది. ఆమెను ముట్టుకోవడానికే ఇష్టపడని పరిస్థితి నుంచి ఆమె దయతలిచి దీవిస్తే చాలు అదే పదివేలు అనే స్థాయికి చేరుకుంది ట్రాన్స్జెండర్ హర్షిణి మేకల. 2018లో మిస్ ట్రాన్స్ క్వీన్ అవార్డు అందుకున్న మేకల హర్షిణికి సంబంధించిన అనేక విషయాలను దిశ టీవీ ప్రతినిధి చేసిన ఈ ఇంటర్వ్యూలో చూసి తెలుసుకోండి.

Advertisement

Next Story

Most Viewed