Transgender Dance: ముజ్రా పార్టీ పేరుతో ట్రాన్స్​జెండర్లతో అసభ్య డ్యాన్స్‌లు

by karthikeya |   ( Updated:2024-11-04 07:49:52.0  )
Transgender Dance: ముజ్రా పార్టీ పేరుతో ట్రాన్స్​జెండర్లతో అసభ్య డ్యాన్స్‌లు
X

దిశ, బడంగ్ పేట్: గత సెప్టెంబరు 30వ తేదీన నగర శివార్లలోని బండ్లగూడ పోలీస్ ​స్టేషన్​ పరిధిలో ముజ్రా పార్టీ పేరుతో అర్థనగ్న డ్యాన్సులు చేస్తున్న నలుగురు ట్రాన్స్​జెండర్లతో కలిసి మరో 8 మందిని పోలీసులు అరెస్ట్​చేసిన ఘటన మరువక ముందే రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్​ పోలీస్‌స్టేషన్​ పరిధిలోని ఆలీనగర్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ముజ్రా పార్టీల పేరుతో ట్రాన్స్​జెండర్లతో అర్థనగ్నంగా డ్యాన్యులు చేయిస్తున్న ఉదంతం నగర శివార్లలో తీవ్ర కలకలం రేపుతోంది. వీకెండ్‌లలో అర్థరాత్రులు ట్రాన్స్​జెండర్లతో అసభ్యకర డ్యాన్సులు చేయిస్తూ యువతను రెచ్చగొట్టి డబ్బులు లాగుతున్నారు కొంతమంది. అంతేకాకుండా మత్తులో తూగుతూ.. రెచ్చిపోయి చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. తరచు ఆలీనగర్‌లో ట్రాన్స్​జెండర్లతో వీకెండ్‌లలో అర్థరాత్రులు పెద్ద పెద్ద శబ్దాలతో అర్థనగ్న డ్యాన్సులు చేయిస్తూ న్యూసెన్స్​చేస్తుండడంతో స్థానికులు ముజ్రాపార్టీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీల పేరుతో బస్తీలలో ఎందుకు న్యూసెన్స్​చేస్తున్నారని గొడవకు దిగారు. ఈ క్రమంలోనే ముబీన్ మీర్జా అనే స్థానికుడు బాలాపూర్​పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే ముజ్రాపార్టీకి సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో వైరల్‌గా మారడంతో బాలాపూర్​పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం అర్థరాత్రి ముజ్రాపార్టీ నిర్వహించిన నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story