- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: తెలంగాణలో 47 మంది డీఎస్పీల బదిలీ
దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్యంగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలు శాఖలో ప్రభుత్వం బదిలీలను చేపడుతోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో పని చేసే అధికారులను బదిలీ చేశారు. తాజాగా తెలంగాణలో 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. అయితే మరోమారు వారిని మార్చింది. ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని పోలీస్ శాఖ ఈ బదిలీలను చేపట్టింది. ఒకే పార్లమెంట్ పరిధిలో నాలుగేళ్లు పని చేసిన డీఎస్పీలను తాజాగా పోలీస్ శాఖ బదిలీ చేసింది.
అయితే 22 రోజుల్లో డీఎస్పీలను అయిదోసారి బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 12వ తేదీ నుంచి మొదలైన ఈ ట్రాన్స్‌ఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ౪౭ మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరిలో ఇటీవలే ట్రాన్స్ ఫర్ అయిన అధికారులు కూడా ఉండటం గమనార్హం.