Telangana High Court : తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బదిలీ!

by M.Rajitha |
Telangana High Court : తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బదిలీ!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి(Telangana High Court CJ) బదిలీ కానున్నట్లు తెలుస్తోంది. వీరి బదిలీకి సుప్రీంకోర్ట్ కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే తెలంగాణతోపాటు బాంబే హైకోర్ట్ బాంబే హైకోర్ట్ న్యాయమూర్తి బదిలీకి కూడా సిఫారసులు జరిగినట్టు సమాచారం. తెలంగాణ హైకోర్ట్ సీజేగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధే(Justice Alok Aradhe)ను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్ట్ సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. కాగా జస్టిస్ అలోక్ అరాధే 2023లో తెలంగాణ హైకోర్ట్ సీజేగా నియమించబడ్డారు.

Advertisement

Next Story