తెలంగాణ వ్యాప్తంగా మరో 26 మంది డీఎస్పీలు బదిలీ

by GSrikanth |
తెలంగాణ వ్యాప్తంగా మరో 26 మంది డీఎస్పీలు బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా.. రాష్ట్ర వ్యాప్తంగా మరో 26 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన మూడు రోజుల్లోనే మొత్తం బదిలీ అయిన డీఎస్పీల సంఖ్య 200 మందికి పైగా చేరింది. కాగా, ఎన్నికల అధికారుల సూచనలతో ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్‌ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

తాజాగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఎన్నికల నేపథ్యంలో గత మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తున్న, సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ డిసెంబర్‌లో ఆదేశించిన విషయం తెలిసిందే. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులకు స్థాన చలనం కల్పిస్తున్నది.

Advertisement

Next Story