- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ బొటానికల్ గార్డెన్ ని సందర్శించిన శిక్షణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్..
దిశ, జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ ను తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ, హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లు తమ క్షేత్ర పర్యటనలో భాగంగా మంగళవారం సందర్శించారు. వీరికి గార్డెన్ సమన్వయ కర్త డా. బి. సదాశివయ్య సాదర స్వాగతం పలికారు. అనంతరం వీరికి గార్డెన్ లోని వివిధ విభాగాలను చూయించి అందులోని మొక్కలను వాటి విశిష్టతను వివరించారు. నెట్ హౌస్ లో పెంచున్న జాతులను సైతం చూపించి వివరించారు. తెలంగాణ స్టేట్ హెర్బేరియంను సందర్శించి అక్కడున్న మొక్కల నమూనాలను పరిశీలించారు.
రీసెర్చ్ లాబ్ లో భద్రపరచబడిన పాములను గురించి వివరించారు. ఫారెస్ట్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ అంజనేయులు సారథ్యంలో వీరు గార్డెన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు మాట్లాడుతూ.. తెలంగాణ బొటానికల్ గార్డెన్ సందర్శించడం ద్వారా తమకు ఇంతవరకు తెలియని వివిధ రకాల మొక్కలు వాటి విశిష్టత, అనేక రకాల పాముల జీవన విధానం వాటి మనుగడ గురించి తెలిసిందని, తమకు ఈ పర్యటన తమ ఉద్యోగ రీత్యా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. తెలంగాణ బొటానికల్ గార్డెన్ ప్రతి ఒక్క ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సందర్శించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్థులు రామకృష్ణ, శంకర్, ఉదయ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.