Breaking: హైదరాబాద్‌‌లో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

by srinivas |   ( Updated:2024-07-21 15:40:50.0  )
Breaking: హైదరాబాద్‌‌లో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి
X

దిశ,వెబ్ డెస్క్: హైదరాబాద్ సనత్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. జెక్ కాలనీ ఆకృతి అపార్ట్‌మెంట్‌లో కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. బాత్ రూమ్‌లో ముగ్గురు మృతదేహాలు పడి ఉన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. బాత్ రూమ్‌ గ్లీజర్ నుంచి కరెంట్ సరఫరా జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఒకరిని కాపాడబోయే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరికి సైతం కరెంట్ షాక్ కొట్టి ఉంటుందని భావిస్తున్నారు. ఎంతకీ బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపు తీశారు. బాత్ రూమ్ లో ముగ్గురు పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ముగ్గురు కరెంట్ షాక్‌తోనే చనిపోయారా.. మరేదైనా కారణాల ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story