- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Traffic: హైదరాబాద్ కు క్యూ కట్టిన వాహనాలు.. టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
దిశ, డైనమిక్ బ్యూరో: దసరా పండుగ ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన జనం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కట్టారు. దీంతో జిల్లాల నుంచి పట్టణానికి వచ్చే ప్రధాన మార్గాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్ ప్లాజాల వద్ద వాహానాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో వాహన దారులు గంటల కొద్ది రోడ్లపైనే వేచి చూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చే మార్గం మధ్యలో దుద్దెడ టోల్ ప్లాజా వద్ద దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు కిక్కిరిసిపోయాయి. అలాగే ఏపీ నుంచి ఉమ్మడి నల్లగొండ మీదుగా హైదరాబాద్ కు వచ్చే ప్రధాన రహాదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహానాలు బారులు తీరాయి. అంతేగాక కరీంనగర్ రాజీవ్ రహదారి రేణికుంట టోల్ ప్లాజా వద్ద కూడా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. మరో వైపు మహబూబ్ నగర్ వచ్చే రహదారిలో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.