సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా రేపు ట్రాఫిక్ ఆంక్షలు

by M.Rajitha |
సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా రేపు ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : సద్దుల బతుకమ్మ(Bathukamma) వేడుకల సందర్భంగా రేపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అమరవీరుల స్మారకస్థూపం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. గురువారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉందనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాంతాల గుండా వెళ్ళే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. వేడుకలు ప్రశాంతంగా ముగిసే విధంగా పోలీసులకు సహకరించాలని కోరారు.

Advertisement

Next Story