TTD News : గజవాహనంపై ఊరేగిన మలయ్యప్పస్వామి

by M.Rajitha |   ( Updated:2024-10-11 16:51:56.0  )
TTD News : గజవాహనంపై ఊరేగిన మలయ్యప్పస్వామి
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజైన బుధవారం రాత్రి మలయ్యప్పస్వామి గజవాహనంపై తిరుమాఢవీధుల్లో విహరించారు. గజవాహనంపై ఊరేగుతున్న స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని తరించారు. ఈ ఊరేగింపులో తిరుమల గజాలైన లక్ష్మి, మహాలక్ష్మి, పద్మావతి, పద్మజలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గజాలు ముందు కదులుతుంటే భక్తులు వాటిని అనుసరిస్తూ.. మాఢ వీధులను గోవింద నామస్మరణతో హోరెత్తించారు. నేటి గజవాహనసేవలో జీయర్లతోపాటు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story