Women's T20 World Cup: శ్రీలంకపై భారత్ భారీ విజయం

by Mahesh |
Womens T20 World Cup: శ్రీలంకపై భారత్ భారీ విజయం
X

దిశ, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా ఈ రోజు 12 మ్యాచ్ గ్రూప్-A లోని భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు షెఫాలి వర్మ 43, స్మృతి మంధన 50 పరుగులతో నిలకడగా రాణించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులతో అజేయంగా నిలిచింది. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన శ్రీలంక మహిళా జట్టు బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మొదటి బంతికే 1 కోల్పోయిన లంక ఆ తర్వాత రెండో ఓవర్, మూడో ఓవర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది. అనంతరం కూడా వరుసగా వికెట్ల కోల్పోవడంతో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆలౌట్ కాకుండా ఉండేందుకు చివరి వరకు ప్రయత్నించి లంక బ్యాటర్లు.. 19.5 ఓవర్లకు 90 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యారు. దీంతో భారత్ 82 పరుగులు భారీ తేడాతో విజయం సాధించి గ్రూప్ -A లోని పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి చేరుకున్నారు. ఈ మ్యాచులో భారత బౌలర్లలో రేణుకా ఠాకుర్ 2, ఆషా శోభన 3, అరుంధతి రెడ్డి 3, దీప్తీ శర్మ, శ్రేయంకా పాటిల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Advertisement

Next Story