కాసేపట్లో జాతీయ గీతాలాపన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

by GSrikanth |   ( Updated:2022-08-16 02:53:46.0  )
కాసేపట్లో జాతీయ గీతాలాపన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా నేడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా సామూహిక జాతీయ గీతాలాపన 'జనగణమన' పాడాలని పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌ నగరంలోని అబిడ్స్‌ జనరల్ పోస్టాఫీస్ సర్కిల్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Advertisement

Next Story