బీజేపీలో బీసీలపై వివక్ష.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్​ గౌడ్

by Javid Pasha |
బీజేపీలో బీసీలపై వివక్ష.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్​ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలపై బీజేపీ పార్టీ వివక్ష చూపుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్​​ గౌడ్ పేర్కొన్నారు. బండి సంజయ్​ 3 ఏళ్లుగా కష్టపడినా.. ఢిల్లీలోని జాతీయ నాయకత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన మంగళవారం సోషల్​ మీడియాల్లో ఫైర్​ అయ్యారు. గతంలో సున్నా నుంచి బీజేపీని 2 శాతానికి తీసుకువచ్చిన ఘనత బండి సంజయ్దని కొనియాడారు. కానీ కేంద్రం కేసీఆర్​ కనుసన్నల్లోనే నడుస్తుందన్నారు. అందుకే కేసీఆర్​ సన్నిహితుడైన కిషన్​ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించారన్నారు.

బీజేపీ వెనుకబడిన తరగతుల నాయకులను అన్యాయం చేస్తుందన్నారు.కేటీఆర్ అమిత్ షా ని కలిసి వారికి అనుకూలంగా ఉన్న వారిని అధ్యక్షుడిగా మార్చుకున్నారన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్​ గ్రహించి బీసీ, ఎస్టీ, ఎస్టీ లకు మేలు చేసే పార్టీలో చేరాలని మహేష్​గౌడ్​ హితవు పలికారు. బీజేపీ బీసీలకు వ్యతిరేఖి అని నొక్కి చెప్పారు.

Advertisement

Next Story