- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12 మంది ఎమ్మెల్యేలపై స్పీడు పెంచిన T- కాంగ్రెస్.. హాట్ టాపిక్‌గా లేఖ..!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేల విషయంలో టీపీసీసీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ అంశంపై మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ.. తాజాగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు ఫిర్యాదు చేయబోతోంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కూడిన 10 మంది కాంగ్రెస్ సభ్యుల బృందం సీఎస్‌ను కలవబోతోంది. ఇందుకోసం జనవరి 9వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ శనివారం సీఎస్‌కు లేఖ రాశారు. మరోవైపు ఈ 12 మంది ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేసింది. పార్టీల మధ్య ఈ అంశంపై మాటల యుద్ధం కొనసాగుతోంది.
కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల ఇంటి ముందు చావు డప్పులు కొడతామని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పగా, తాము రాజ్యాంగం ప్రకారమే బీఆర్ఎస్‌లో విలీనం అయినట్టు పైలట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డిలు కౌంటర్ ఇచ్చారు. గతంలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలను సోనియా గాంధీ సమక్షంలో విలీనం చేశారని అప్పుడు ముడుపులు ఇస్తేనే వారు కాంగ్రెస్‌లో చేరారా? అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఇష్యుపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు నిద్రపోయి ఇప్పుడు కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే దొంగలు పడ్డ ఆర్నెల్లకు మెల్కొన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని.. కానీ పైకి ఎమ్మెల్యేలను కేసీఆర్ చేర్చుకున్నాడని ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు.
- Tags
- TPCC