- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ఇప్పటి నుండే సిద్ధం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో స్పీడ్ పెంచాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను తట్టుకుని వారిపై పోటీ చేసే గెలుపు గుర్రాలను వేటాడే పనిలో కాంగ్రెస్, బీజేపీ నిమగ్నమైపోయాయి. ఇందుకోసం ఇప్పటి నుండి అన్ని పార్టీలు నియోజకవర్గాల వారిగా సర్వేలు చేయించి గెలుపు గుర్రాలను వెతుకున్నాయి. ఈ సర్వేల ఫలితాల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీల నుండి అభ్యర్థులను బరిలోకి దించేలా పార్టీలు ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఎక్కడి నుండి బరిలోకి దిగాలనేది తనతో సహా ప్రతి క్యాండిడేట్‌కు సర్వేనే ప్రాణిమాణికమని తేల్చిచెప్పారు. ఇటీవల కర్నాటకలో కాంగ్రెస్ అఖండ విజయానికి కూడా ఈ విధానమే కారణమన్నారు. కర్నాటక ఎన్నికల్లో సీనియర్ నేత సిద్ధరామయ్యకు కూడా అడిగిన చోటు నుండి కాకుండా సర్వే ఆధారంగానే టికెట్ కేటాయించారని రేవంత్ గుర్తు చేశారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఎన్నికల సమయంలో చర్చిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.