కేసీఆర్ తప్పుడు నిర్ణయాలకు కారణమిదే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-08-30 14:38:46.0  )
కేసీఆర్ తప్పుడు నిర్ణయాలకు కారణమిదే.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెగా డీఎస్సీ ప్రకటించాలని అభ్యర్థులు చేస్తున్న పోరాటానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. ఇది మెగా డీఎస్సీ కాదని.. ఎన్నికల కోసమే కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ అని సెటైర్ వేశారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీగా ఉంటే.. సీఎం కేసీఆర్ మాట ప్రకారం 13 వేల పోస్టుల ఖాళీలు ఉన్నాయన్నారు. అయితే నోటిఫికేషన్లను కేవలం 5 వేల పోస్టులకేనా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఎన్నికల భయం పట్టుకున్నదని, అందుకే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడన్నారు.

కర్ణాటకలో గృహలక్ష్మి పథకాన్ని రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో చేతి గుర్తు మా చిహ్నం.. చేసి చూపించడమే మా నైజం అని రేవంత్ ట్వీట్ చేశారు. ‘‘'కారు'కూతలు రావు'..జుటా' మాటలు లేవు అని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్ వేశారు. ఇచ్చిన మాట ప్రకారమే.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే.. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన 5 హామీల్లో.. నాలుగింటిని నెరవేర్చి చరిత్ర సృష్టించాం.’’ అని రేవంత్ చెప్పారు.

ఇక కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఒక గజదొంగ దారిదోపిడీ చేసి సర్వం దోచుకున్న తర్వాత దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచోకోమని ఇచ్చిననట్లుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ బండ ధర రూ.410 ఉంటే దానిని మోడీ అధికారంలోకి వచ్చాక రూ.1200 చేశారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేసి తీరా ఇప్పుడు గ్యాస్ ధర తగ్గించడాన్ని ఇలా కాకుండా మరెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed