ఆ స్కామ్ బయటపడుతుందనే సెక్రటేరియట్‌కు రానివ్వడం లేదు: రేవంత్ రెడ్డి ఫైర్

by Satheesh |   ( Updated:2023-05-01 14:18:45.0  )
Revanth Reddy will not Participate in Munugode Padayatra Due to Covid Symptoms
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ప్రభుత్వం ఔటర్​రింగ్ రోడ్డు నిర్మిస్తే.. కేసీఆర్​దాన్ని అమ్ముతున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఆదాయం వస్తున్నా.. ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం దారుణమన్నారు. ఔటర్ రింగురోడ్డు టెండర్లలో జరిగిన అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం తనను సెక్రటేరియట్‌కు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుందన్నారు. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్, కేటీఆర్‌లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదని, కానీ కేసీఆర్ పాలనలో ఒక ఎంపీగా ఉన్న తనను సెక్రటేరియట్‌కు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడానికి వెళ్తున్నానని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. ఒక ఎంపీకి ప్రత్యేకంగా అనుమతి ఏమిటని ప్రశ్నించారు. ఎంపీగా తన కార్డే తనకు అనుమతి అని చెప్పారు. పోలీసులు రోడ్డుపై అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

Read more:

బ్రేకింగ్: రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. టెలిఫోన్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

Advertisement

Next Story

Most Viewed