Mahesh Kumar Goud: భేటీలో రాహుల్ గాంధీ గంటసేపే ఉంటారు

by Gantepaka Srikanth |
Mahesh Kumar Goud: భేటీలో రాహుల్ గాంధీ గంటసేపే ఉంటారు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ మేధావులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC chief Mahesh Kumar Goud) భేటీ అయ్యారు. నవంబర్ 5వ తేదీన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. బీసీ కుల గణనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో సలహాలు, సూచనలు ఇవ్వాలని మేధావులను మహేష్ కుమార్ గౌడ్(TPCC chief Mahesh Kumar Goud) కోరారు. బిజీ షెడ్యూల్ వల్ల హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) గంటసేపు మాత్రమే భేటీలో పాల్గొంటారని అన్నారు.

కుల గణనలో ఎలాంటి అంశాలు ఉండాలో సూచించాలని రిక్వెస్ట్ చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. పీసీసీ ఆధ్వర్యంలో నవంబర్ 6 లేదా 7న అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తామని ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. కుల గణనపై అన్ని పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని వివరించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ ముందుకెళ్తుందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed