Mahesh Kumar Goud: లగచర్ల దాడి వెనుక కేటీఆర్

by Gantepaka Srikanth |
Mahesh Kumar Goud: లగచర్ల దాడి వెనుక కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: లగచర్ల దాడి ఘటన(Lagacharla incident)పై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) సీరియస్ అయ్యారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను తప్పపట్టడమే పనిగా బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) పార్టీల వ్యవహారం ఉందని అన్నారు. హైడ్రా(Hydra) తప్పు అన్నారు. మూసీ(Musi) పునరుజ్జీవం తప్పు అన్నారు. ఇప్పుడు లగచర్ల ఫార్మా విషయంలోనూ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. లగచర్ల దాడి వెనుకు కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఉన్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని అంత సులువగా వదిలిపెట్టబోమని.. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు.

మరోవైపు.. ఇప్పటికే దాడి ఘటనలో కుట్రకోణం దాగి ఉందని హైదరాబాద్‌ మల్టీజోన్‌-2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాత్ర ఉందని, అందుకే ఆధారాలతో ప్రధాన నిందితుడిగా చేర్చామని చెప్పారు. మరింత లోతుగా విచారణ చేసి వివరాలు తెలుసుకోవడానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. దాడిలో పాల్గొన్న 42 మందిని గుర్తిస్తే, వారిలో 19 మందికి అసలు భూమే లేదని తేలిందన్నారు. ప్రాథమిక విచారణలో ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు.

Advertisement

Next Story