షర్మిల కుమారుడి రిసెప్షన్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు

by GSrikanth |
షర్మిల కుమారుడి రిసెప్షన్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కుమారుడి రిసెప్షన్‌కు హాజరు అయ్యారు. వీరితో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. తర్వాత ఆ ఇద్దరి నేతలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చర్చించారు. టిక్కెట్ల మధ్య కాంపిటేషన్, గెలుపు గుర్రాల పేర్లను సీఎం వివరించినట్లు సమాచారం. దీంతో పాటు నామినేటెడ్ పదవుల ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నామినేటెడ్ పదవులు ఇవ్వాలా? ఆ తర్వాత ఇద్దమా? అనే అంశంపై మల్లికార్జున ఖర్గే, కేసీ , రేవంత్ రెడ్డిలు చర్చించుకున్నట్లు సమాచారం.





Advertisement

Next Story