అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే టంగ్ స్లిప్.. ఏకంగా సీఎంనే..!

by Ramesh N |
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే టంగ్ స్లిప్.. ఏకంగా సీఎంనే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ కూడా తమ అభిప్రాయం తెలియాలని ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సభలో మాట్లాడుతుండగా టంగ్ స్లిప్ అయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారని ఆయన సంబోధించారు. దీంతో సీఎం రేవంత్ ను కిరణ్ కుమార్ రెడ్డి అనడంతో తన తప్పు తెలుసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తమ్ భేటీ అయ్యారని అని సభకు సారి చెప్పారు. దీంతో సభలో నేతలు నవ్వారు.

Advertisement

Next Story